మున్సిపల్ ఎన్నికలవేళ తీవ్ర విషాదం..

మున్సిపల్ ఎన్నికలవేళ తీవ్ర విషాదం..
ఆత్మహత్యకు పాల్పడ్డ బీజేపీ అభ్యర్థి కరుకలి మహాదేవ్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘటన
మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలకు ఒక రోజు ముందు తీవ్ర విషాదం చోటుచేసుకుంది .అధికార పార్టీ నుండి వస్తున్న బెదిరింపులను తాలలేక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డ సంఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా ఎరుకలి మహదేవ్ రిజర్వుడు వార్డు నుండి పోటీ చేస్తున్నారు. అతడి సొంత అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రజల మద్దతుతో గెలుపు దిశలో ముందుకెళుతున్న సమయంలో అధికార పార్టీ నుండి ఒత్తిడిలు బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
దీంతో పార్టీ నాయకుల వద్ద తనకు బెదిరింపులు వస్తున్నాయని ఒత్తిడి చేస్తున్నారని సరెండర్ కావాలి లేదా పోటీ నుండి తప్పుకోవాలని నామినేషన్ల సమయం నుండి ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉండి ప్రచారంలో దూసుకుపోతూ గెలుపు బాటలో పయాణిస్తున్న సందర్భంలో బెదిరింపులు ఒత్తిడిలు తీవ్ర కావడంతో ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్ర నుండి లేచిన కుటుంబ సభ్యులకు ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కలకలం రేపింది.

గత ఐదారు రోజులుగా తన భర్తకు బెదిరింపులు ఒత్తిడిలు రావడం వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు మృతుడి భార్య తెలిపారు. మొత్తం మీద ప్రత్యర్థుల ఒత్తిడితో తీవ్ర మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, నాయకులు జి.బలరాం రెడ్డి, బి. రాజశేఖర్ రెడ్డి, బాల్చేడ్ మల్లికార్జున్, కర్ని స్వామి, దేవరింటి నర్సింహారెడ్డి, జయానందన్ రెడ్డి తదితరులు ఘటన స్థలానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం కాకుండా ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

