సిద్దిపేట : కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లాలోని
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినేటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్ అండ్ రోబోటిక్ ల్యాబ్ లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీపీవో దేవకి, ఆర్డీవో రామ్మూర్తి, ఎంఈవో పద్మయ్య, ఇన్ఫినెటివ్ విద్యా ఫౌండేషన్ కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ లో డ్రింకింగ్ వాటర్, అదనంగా రెండు తరగతి గదులు, స్పోర్ట్స్ మెటీరియల్ అవసరముందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేలా గ్రామాల్లో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు ఉపయోగించుకోవాలన్నారు. చదువుపై ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో అవగాహన కల్పించాలన్నారు.