congress l 24వ డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి…

congress l 24వ డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి…

గుమ్మడాల రాధా గోవర్ధన్ గౌడ్‌కు అఖండ మద్దతు ఇవ్వాలి
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ హనుమంత రావు

congress l మహబూబ్ నగర్,ఆంధ్రప్రభ:మహబూబ్నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మడాల రాధా గోవర్ధన్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు విహెచ్ హనుమంతరావు పిలుపునిచ్చారు.రాధా గోవర్ధన్ గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ… గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజాధనం దోచుకొని దాచుకున్న కారణంగా అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

నేడు రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం నిజమైన ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్‌కే ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థుల మాయమాటలు నమ్మి అభివృద్ధిని దూరం చేసుకోకండి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని,ముఖ్యంగా 24వ డివిజన్‌లో గుమ్మడాల రాధా గోవర్ధన్ గౌడ్ హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం సాధించేటట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా నాయకులు బేక్కరి మధుసూదన్ రెడ్డి,రామ్మోహన్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొనగా, కాలనీవాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్‌కు తమ మద్దతు తెలిపారు.

Leave a Reply