పాత పాలమూరులో బిఆర్ఎస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం…

పాత పాలమూరులో బిఆర్ఎస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం…

ప్రజల గుండెల్లోకి నందిపేట శ్రీనివాసులు!

మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): పాలమూరు నగరపాలక సంస్థ పరిధిలోని పదవ డివిజన్‌లో బిఆర్ఎస్ అభ్యర్థి నందిపేట శ్రీనివాసులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాలనీలలో ఓటర్లలో తాతా బాగున్నావా…? అమ్మ బాగున్నావా…? అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి గడపను తట్టుతూ ప్రజల్లో మమేకమవుతున్న ఆయన ప్రచారం డివిజన్ అంతటా చర్చనీయాంశంగా మారింది. కాలనీల్లో అడుగుపెట్టగానే ప్రజల బాగోగులు, స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటూ తనదైన శైలిలో విశ్వాసాన్ని సంపాదిస్తున్నారు.
ఈసారి తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని శ్రీనివాసులు హామీ ఇస్తున్నారు. డివిజన్‌లో పేరుకుపోయిన సమస్యలను అధికార పార్టీతో పోరాడి మరీ పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రచార ఉత్సాహం చూసిన ఓటర్లలో శ్రీనివాసుల గెలుపుపై నమ్మకం పెరుగుతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి డబ్బు మదం, ఓటర్లపై చిన్న చూపు కారణంగా ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజల మధ్యే ఉండి, ప్రజల భాషలో మాట్లాడుతున్న నందిపేట శ్రీనివాసులకే ఈసారి మేలు జరుగుతుందన్న అభిప్రాయం డివిజన్‌లో బలంగా వ్యక్తమవుతోంది.

Leave a Reply