శఠము అనగా అజ్ఞానము, అరి అనగా శత్రువు, శఠారి అనగా అజ్ఞానమునకు శత్రువు. శఠారి అనగా శ్రీమన్నారాయనుడి పాదాలు. భక్తులకు స్వామి పాదాలు శిరస్సున ఉంచుట శఠారి పెట్టడంలోని అంతరార్ధం. శఠారిని నమ్మాళ్ వారు అని కూడా అంటారు. నమ్మాళ్ వారు శ్రీమన్నారాయణుడికి పాదములవంటి వారు.