49వ డివిజన్‌లో బీఆర్ఎస్ జోరు…

49వ డివిజన్‌లో బీఆర్ఎస్ జోరు…
ఇంటింటి ప్రచారంతో వి. సాయి హర్షవర్ధన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ
శ్రీనివాస్ గౌడ్ ఆశీస్సులతో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సాయి హర్షవర్ధన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడుగా నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్న ఆయనకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతున్న సాయి హర్షవర్ధన్ రెడ్డి, డివిజన్ భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టితో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదంతో పాటు డివిజన్‌లోని సీనియర్ నాయకులు బొక్క రవి, పడమటి శ్రీకాంత్ వంటి నాయకుల సమిష్టి కృషితో బీఆర్ఎస్ శ్రేణులు గెలుపే లక్ష్యంగా ఏకమవుతున్నాయి. పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనడం, ప్రతి కాలనీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఈ డివిజన్‌లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
ఇంటింటి ప్రచారంలో భాగంగా శివాలయం ప్రాంతం, బీకే రెడ్డి కాలనీ, శేషాద్రి నగర్, మహేశ్వరీ కాలనీ, నాగిరెడ్డి కాలనీ, ఉమర్ ఫరూక్, పోచమ్మ గుడి కాలనీల ప్రజలు వి. సాయి హర్షవర్ధన్ రెడ్డిని ఆశీర్వదిస్తూ ఈసారి గెలిపించుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. గత అనుభవాలు, యువ నాయకత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఆయనకు ప్రధాన బలంగా మారుతున్నాయి. 49వ డివిజన్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సమీకరణలు, పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి సాయి హర్షవర్ధన్ రెడ్డి విజయపథంలో దూసుకెళ్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల రోజు సమీపిస్తున్న కొద్దీ ఈ డివిజన్‌లో పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.
