Arun l 2వ వార్డులో బీఆరఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ ప్రచార జోరు..

Arun l 2వ వార్డులో బీఆరఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ ప్రచార జోరు..
గెలుపు దిశగా దూసుకుపోతున్న ప్రచారం…
Arun l బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ కుమార్ తన ప్రచారంతో వార్డును హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అరుణ్ కుమార్ కొత్త బస్టాండ్ నుంచి గ్రౌండ్ బస్తీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తన బలాన్ని చాటుకున్నారు. యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ వార్డు ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
ప్రచారంలో భాగంగా సబ్బని అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి తాను అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. 2వ వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కౌన్సిల్‌లో నిరంతరం గళమెత్తుతానని భరోసా ఇచ్చారు. వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. పట్టణాభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.వార్డు అభివృద్ధికి ఆయన స్పష్టమైన విజన్‌ను ప్రకటించారు. తాను గెలిచిన వెంటనే వార్డులోని అన్ని వీధుల్లో నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని వాగ్దానం చేశారు.
అలాగే శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యను పూర్తిగా తొలగిస్తానని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచి 2వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా అరుణ్ కుమార్‌కు బస్తీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. యువ నాయకుడిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ భారీ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సబ్బని అరుణ్ కుమార్ విజయానికి నినదిస్తున్నారు.
