Get Together | 47 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య స్నేహితులు

Get Together | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ ఉన్నత పాఠశాల కు చెందిన 1979–80 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు దాదాపు 47 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ కార్యక్రమం హృదయాన్ని హత్తుకునే ఘటనగా నిలిచింది. జీవిత ప్రయాణంలో ఎవరు ఎక్కడికి వెళ్లినా, కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, బాల్య స్నేహం మాత్రం చెదరదని ఈ గెట్టు గెదర్ స్పష్టంగా చాటిచెప్పింది. ఒకరినొకరు చూసుకున్న క్షణంలోనే పాత జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమై, ఆనందభాష్పాలతో స్నేహితుల హృదయాలు నిండిపోయాయి. పాఠశాల రోజులలో చేసిన అల్లరి, పంచుకున్న అనుభూతులు, గురువుల ఆశీస్సులు అన్నీ స్మరించుకుంటూ ఆత్మీయంగా సంభాషించుకున్నారు. ఎంతోకాలం తర్వాత కలుసుకున్న ఈ స్నేహసమ్మేళనం అందరిలోనూ అపారమైన భావోద్వేగాన్ని రేకెత్తించి, జీవితాంతం నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా మారింది.
