ఘనంగా సన్మానం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పంగిడిపల్లి యందు ఎస్ జి టి గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు వంతడుపుల రఘు జాతీయ క్రీడా రత్న పురస్కారానికి ఎంపిక కావడం పట్ల టేకుమట్ల మండలములోని ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేశారు.రఘు ఇటీవల భూటాన్ దేశ రాజధాని థింఫులో నిర్వహించిన 12వ అంతర్జాతీయ మాస్టర్ గేమ్స్- 2025లో పాల్గొని అథ్లెటిక్స్ హేమర్ త్రో గేమ్ విభాగంలో పాల్గొని భారతదేశానికి బంగారు పతకం సాధించడం జరిగినది. జడ్.పి.హెచ్.ఎస్ వెలిశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ ఆధ్వర్యంలో వంతడుపుల రఘు కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో మండలములోని ఉపాద్యాయులు రఘు ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కే. ప్రసాద్ మాట్లాడుతూ క్రీడల పట్ల మక్కువతో అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే కాకుండా పథకాన్ని కూడా సాధించడం ఉపాధ్యాయ వృత్తికి అలాగే వెలిశాల కాంప్లెక్స్ మరియు టేకుమట్ల మండలానికి పేరు తీసుకొచ్చారని కొనియాడారు.రఘు క్రీడా రంగములో సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు .తిరుపతి .గిరిబాబు , శ్రీనివాస్, సుమన్, రమేష్, సురేందర్, హకీమ్ , రవీందర్, ప్రవీణ్ , సురేష్ బాబు , ఇంద్రగోపాల్ , నవత , తిరుమల , శోభ, సుమతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply