పోటా పోటీగా ప్రచారాలు ప్రలోభాలు షురూ..

పోటా పోటీగా ప్రచారాలు ప్రలోభాలు షురూ..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల సమయం సమిపిస్తుండడంతో చెన్నూరు లో అభర్థుల ప్రచారాలు పోటపోటీగా సాగుతున్నాయి, వార్డుల్లో మైకుల మోతలు కార్యకర్తల నాయకుల పలకరింపులతో సందండిగా మారింది, ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాల తో పోటీ పడుతూ ఇండిపెండెంట్, పార్టీల రెబల్ అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల ప్రచారాలకు దిటుగా ప్రచారాలు చేపట్టడంతో ఎవ్వరికి ఓటువేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ఆయా వార్డు ప్రజలు పేర్కొటున్నారు. పోలింగ్ సమయం సమిపిస్తుండడంతో వార్డులో అభ్యర్థులు మకాం వేసి ప్రలోభాలు చూపిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నలు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే తమ నివాసలలో వంటలు వార్పులు మొదలు పెట్టి ముక్క చుక్క లను ఎరగావేసి ఓటర్లను తమ వెంట వేసుకొని ప్రచారాలు చేస్తున్నారు.18వ వార్డులు ఉన్న మున్సిపల్ అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులను గెలిపించుకొని అధికారాన్ని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తుంటే బిఆర్ఎస్, బిజెపి పార్టీలు సైతం బలమైన అభ్యర్థుల పోటీకి దింపి ప్రయత్నాలు సాగించడంతో పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అనే పరిస్థితి కి చేరుకుంది.

Leave a Reply