అభివృద్ధి నా బాధ్యత.. ఓటేసే బాధ్యత మీది..

పాల్వంచ, ఆంధ్రప్రభ : అభివృద్ధి మా బాధ్యత ఓటేసే బాధ్యత మీదని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లగుండ్ల సుజాత అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఏడవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల గుండ్ల సుజాత జయమ్మ కాలనీ లో ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యసిస్తున్నారు. డివిజన్లో అన్ని కాలనీలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే చేస్తుందని అందుకు నిదర్శనమే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. అందరిని నవ్వుతూ పలకరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం సమస్యలపై పోరాడుతున్న తనను గెలిపించాలని అర్జించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply