1.061 tons | ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

1.061 tons | ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
1.061 tons | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కడప జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు 1.061 టన్నుల బరువు కలిగిన 36 ఎర్రచందనం దుంగలను, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రాజంపేటలోని మన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు.
1.061 టన్నుల 36 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని, ఐదుగురు దుండగులను అరెస్ట్ చేశామన్నారు. పట్టుకున్న సరుకును స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలని, వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.
