41వ డివిజన్‌లో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం…

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్న లక్ష్మణ్ యాదవ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఉత్సాహంగా సాగుతోంది. డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించిన స్వప్న యాదవ్… ప్రజల నిత్యజీవితాన్ని వేధిస్తున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటికి శాశ్వత పరిష్కారాలే తన కార్యాచరణగా ఉండనున్నాయని స్పష్టం చేశారు.కాలనీల్లో నెలకొన్న తాగునీటి కొరత, శిథిలావస్థలో ఉన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలు, పారిశుధ్య లోపాలు, నిరుద్యోగ సమస్యలు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

మాటలకే పరిమితం కాకుండా, గత దశాబ్దాలుగా తాను చేసిన ప్రజాసేవే తనకు ప్రధాన గుర్తింపని, అదే నిబద్ధతతో భవిష్యత్తులోనూ ప్రజల కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి,సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ విధానమని స్వప్న యాదవ్ తెలిపారు. రాజకీయ లాభనష్టాలకు అతీతంగా ప్రజల సమస్యలే తన అజెండా అని స్పష్టం చేస్తూ, డివిజన్‌ను ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె ప్రచారంలో మాట్లాడుతూ… ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వప్న యాదవ్‌కు తమ మద్దతు తెలిపారు.

Leave a Reply