DanceQueen Real Reel: ఆడే పిల్లే కాదు Andhra prabha TOP story

DanceQueen Real Reel: ఆడే పిల్లే కాదు Andhra prabha TOP story
కష్టాలు కన్నీళ్లకు వెరవని డ్యాన్స్ క్వీన్
డ్యాన్స్ పై ముమైత్ ఖాన్ మమకారం
జీవన పోరాటంలో అలుపెరుగని ధీర
( ఆంధ్రప్రభ, వెబ్ టాప్ స్టోరీ వింగ్ )
ఆడపిల్లనమ్మా.. ఆడపిల్లనానని.. బాధపడకమ్మా.. బాధపడకమ్మా.. అనే పాట తెలుగునాట ఎందరో గుండెల్ని పిండి చేసింది. నిజమే.. ఆడపిల్లంటే.. అందరికీ అలుసే. కానీ అదే ఆడపిల్ల ..తన కుటుంబం కోసం కౌమర దశలోనే బతుకు పోరాటంలోకి దిగింది. శృంగార నృత్యతారగా యావత్ భారతావనిని ఉర్రూతలూగించింది. కేవలం ఐటెమ్ సాంగ్ డ్యాన్సరే కాదు, కీలక పాత్రల్లోనూ రౌద్రం..హాస్యం పండించిన ఈ తారా ఎవరో కాదు..

నా పేరు రంభా, నా ఊరు తుంబా అనే పాటతో స్వామి అనే చిత్రంలో తెలుగు జనం గుండెల్ని ఉర్రూతలూగించటమే కాదు… ఇప్పటికింకా నా వయస్పు నిండా పదహారే.. చీటికి మాటికి చుట్టూ తిరిగే కుర్రాళ్లే అనే పాటతో.. ఇప్పటికీ తెలుగునాట అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న.. డ్యాన్స్ క్వీన్ ముమైత్ ఖాన్. (Dance Queen) ఆమె సినీ జీవనయానంలో ఎన్నో ఓడిదుడుకులు.. పోయిన ప్రాణం తిరిగొచ్చింది. మళ్లీ అందరినీ అలరించేందుకు సర్వసన్నద్ధమైంది. అంతే కాదు.. తానే ఓ అందాల క్రతువుకు గురువుగా మారింది. గత పాతికేళ్లకు ఆమె కన్నీళ్లు, కష్టాలు, గౌరవ ప్రతిష్టల్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.
DanceQueen Real Reel : ఏడేళ్ల జీవన్మరణ పోరాటం
2016 డిసెంబర్‌లో ముమైత్ ఖాన్ తన అపార్ట్‌మెంట్‌లో మంచం మీద నుండి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. మెదడులోని ఐదు నరాలు చిట్లిపోయాయి. 15 రోజులు కోమాలోకి వెళ్లారు. ఇక ముమైత్ ఖాన్ బతకదని అందరూ భావించారు. వైద్యుల కఠోర శ్రమతో.. ఆమె మృత్యుంజయురాలిగా అవతరించారు. కోమా నుండి కోలుకున్న తర్వాత, కనీసం ఏడేళ్ల పాటు పని చేయవద్దని, 5 కేజీల బరువు కూడా ఎత్తవద్దని డాక్టర్లు సూచించారు.

ఈ సమయంలో ఆమెకు ఫిట్స్ (seizures) రాకుండా మందులు వాడాల్సి వచ్చింది, దీనివల్ల ఆమె బరువు పెరిగారు. ముమైత్ ఖాన్ కష్టకాలంలో ఆమె తల్లి ఆర్థికంగా మానసికగా అండగా నిలిచారు. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆమె హైదరాబాద్‌లో ‘విలైక్’ (Vylike) పేరుతో ఒక మేకప్ హెయిర్ అకాడమీని నడుపుతున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహాలో కాకమ్మ కథలు రియాలిటీ షోలలో కనిపిస్తున్నారు.
DanceQueen Real Reel : కష్టాలకు వెరవని ధీర

ముమైత్ ఖాన్ అంటే.. ఆమె హావభావాలు, నృత్య భంగిమలే గుర్తుకు వస్తాయి. కానీ ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలియవు. ముమైత్ ఖాన్ మొదట ఒక చిన్న డ్యాన్స్ గ్రూప్‌లో చేరారు. అప్పట్లో ఆమె నెలకు కేవలం 1500 రూపాయల జీతానికి బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. రెమ్యునరేషన్ కోసం పడిన కష్టమే ఆమెను గొప్ప డ్యాన్సర్‌గా తీర్చిదిద్దింది. ‘మున్నాభాయ్ MBBS’ (2003) చిత్రంలో ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన సినీ లోకం, ఆ తర్వాత ఆమెను ఐటమ్ సాంగ్స్ క్వీన్‌గా మార్చేసింది.
DanceQueen Real Reel : దేశం మొత్తం ఫిదా

2000వ దశకంలో తన డ్యాన్స్ స్టెప్పులతో తెలుగు సినీ పరిశ్రమను ఊపేసిన ఈ స్టార్. 2002లో హిందీ సినిమాల ద్వారా తన కెరీర్ ప్రారంభించినప్పటికీ, 2003లో వచ్చిన ‘మున్నాభాయ్ MBBS’ సినిమాలోని ‘దేఖ్ లే’ (Dekh Le) పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో 2004లో ‘స్వామి’ చిత్రంతో అడుగుపెట్టారు. కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం కాకుండా, ఆమె కొన్ని కీలక పాత్రల్లోనూ మెప్పించారు.
పోకిరి (2006) ఆమెను టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ను చేసింది. ఇక ఎవడైతే నాకేంటి (2007) చిత్రంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎఫ్. మైసమ్మగా ఆమె చేసిన కామెడీ రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మైసమ్మ IPS (2007) చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషించి, తనలోని నటిని నిరూపించుకున్నారు. మగధీర (2009) చిత్రంలో ‘బంగారు కోడిపెట్ట’ రీమిక్స్ సాంగ్‌లో ఆమె డ్యాన్స్ సెన్సేషన్ సృష్టించింది. పున్నమి నాగు (2009): ఇందులో ఒక పాము (female snake) పాత్రలో కనిపించారు.
DanceQueen Real Reel : సవాళ్లకు ఎదురీత

ముమైత్ ఖాన్ తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని, డ్యాన్స్‌నే తన కెరీర్‌గా మార్చుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 1, 1985న ముంబైలో జన్మించారు. తండ్రి అబ్దుల్ రషీద్ ఖాన్. ఆయన పాకిస్థాన్ మూలాలు ఉన్న భారతీయ ముస్లిం. తల్లి హసీనా ఖాన్ (కొన్ని ఇంటర్వ్యూలలో కృష్ణపాలి/తీషా పాలి అని కూడా పేర్కొన్నారు). ఆమె తమిళనాడులోని తిరుచిరాపల్లి పొన్పు. ముమైత్ ఖాన్‌కు మొత్తం నలుగురు సోదరీమణులు ఉన్నారు.
జబైన్ ఖాన్ (Zabyn Khan) కూడా సినీ పరిశ్రమలో డ్యాన్సర్‌గా నటిగా పరిచయం అయ్యారు. మరొక సోదరి పేరు మిగు కవాలి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముమైత్ 13 ఏళ్ల చిన్న వయస్సులోనే పని చేయడం ప్రారంభించారు. తన తండ్రికి ఆర్థికంగా అండగా ఉండటానికి స్కూలుకు వెళ్లేటప్పుడు బస్సు ఖర్చులు ఆదా చేసి ఆ డబ్బును దాచుకునేవారట. ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆమె చదువు కంటే బాధ్యతలే ముందుకొచ్చాయి. ముంబైలో ప్రాథమిక విద్యను అభ్యసించినప్పటికీ, కుటుంబ అవసరాల కోసం చిన్నతనంలోనే సినీ రంగం వైపు మొగ్గు చూపింది.
DanceQueen Real Reel : ఏడేళ్ల అజ్ఞాతం వీడి…

అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన ఏడేళ్ల కాలంలో ఆమె ఖాళీగా ఉండకుండా బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఈ-కామర్స్ వంటి అంశాలపై స్వయంగా అవగాహన పెంచుకున్నారు. ముమైత్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల నుండి కోలుకున్న తర్వాత మేకప్ , హెయిర్ రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ (Yousufguda)లో విలైక్ (Welyke) మేకప్ & హెయిర్ అకాడమీ ని ప్రారంభించారు.

యువతకు ప్రొఫెషనల్ మేకప్ హెయిర్ స్టయిలింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బేసిక్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు 20 రోజుల ప్రొఫెషనల్ మేకప్ కోర్సులు, బ్రైడల్ మేకప్ , హెయిర్ స్టైలింగ్ శిక్షణ అందిస్తున్నారు. స్వయంగా అకాడమీని పర్యవేక్షిస్తూ, స్థానిక టాలెంట్‌ను ప్రోత్సహించి ఫిలిం ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యం గల ఆర్టిస్టులను అందించడమే తన లక్ష్యమని తెలిపారు. డ్యాన్స్ అంటే ఆమెకు ప్రాణం. “నేను పెర్ఫార్మర్‌ని, 80 ఏళ్లు వచ్చినా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను” అని ఆమె గర్వంగా చెబుతుంటారు.
ALSO READ : Avarics : బొక్కుడే..బొక్కుడు
