World cup| పొట్టి స‌మ‌రానికి వేళాయే..

World cup| పొట్టి స‌మ‌రానికి వేళాయే..

  • నేటి నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్
  • ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభ వేడుకలు
  • బాద్‌షా, నోరా ఫతేహీ ప్రత్యేక ప్రదర్శనలు

World cup|వెబ్‌డెస్క్‌, ఆంధ్రప్ర‌భ : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీని భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. తొలి మ్యాచ్ కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అయితే డిపెండింగ్ ఛాంపియన్‌గా బ‌రిలోకి దిగుతున్న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ వేడుకల్లో ఐసీసీ ఛైర్మన్ జై షా, 2024లో భారత్‌కు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీకి స్వాగతం పలుకుతారు. టోర్నీలో పాల్గొంటున్న 20 దేశాలకు ప్రతీకగా 20 మంది చిన్నారులు వారితో జతకలవనున్నారు. అనంతరం అందరూ కలిసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా తన పాటలతో, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో అలరించనున్నారు. చివరగా ఇద్దరూ కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే శివ‌మ‌ణి, రిష‌భ్ రిఖిరామ్ శ‌ర్మల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఉంటాయి.

Leave a Reply