Kadiyam Srihari | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలి..

Kadiyam Srihari | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలి..

  • -నిజాయితీగా పని చేసే వారిని ఎన్నుకుంటేనే అభివృద్ధి
  • -స్టేషన్ ఘన్ పూర్ లో చాలా సమస్యలు ఉన్నాయి..
  • -పరిష్కారం కావాలంటే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.
  • -గెలిపిస్తే వార్డుకు రూ.2కోట్లతో అభివృద్ధి పనులు..
  • నేను మాట ఇచ్చాను అంటే చేసి తీరుతాను…
  • -ఇతర పార్టీలకు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే..
  • -15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న ఎం అభివృద్ధి చేశాడో మన ఎస్సి కాలనీలను చూస్తేనే తెలుస్తుంది.
  • -ఘన్ పూర్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి..
  • ఈ నెల 11న జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి.

Kadiyam Srihari, స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : నాకు రాజకీయ జన్మనిచ్చి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల ఋణం ఎన్ని జన్మలేత్తినా.. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా తీర్చుకోలేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 12, 13, వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం ఉంటేనే మన ఘన్ పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోగలమని కావున చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అలాగే 14, 15వార్డులలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఘన్ పూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయాలి:

స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ ప్రజలు ఈ నెల 11జరిగే మున్సిపల్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థులను గెలిపిస్తే వారు మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే విధంగా చూసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్క తాటి ఉండి ఘన్ పూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఘన్ పూర్, చాగల్, శివునిపల్లి గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసానని, మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు మంజూరు తెచ్చానని, అందులో 25కోట్ల పనులు ప్రారంభించు కున్నామని 25కోట్ల పనులు టెండర్లు పూర్తి అయ్యాయని ఎన్నికల తర్వాత ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయాని తెలిపారు. వీటితో పాటు 100పడకల అస్పత్రి నిర్మాణం, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల, మున్సిపల్ కార్యాలయం, అత్యాధునిక వస తులతో లైబ్రరీ నిర్మాణం, టౌన్ హల్, ఇంటిగ్రెటెడ్ మార్కెట్ నిర్మాణం వంటి అనేక పనులు చేసుకుంటున్నామని వివరించారు.

-ఘన్ పూర్ లో చాలా సమస్యలు ఉన్నాయి:

ఘనపూర్ లో చాలా సమస్యలు ఉన్నాయని వాటన్నంటిని పరిష్క రించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి చేసే పార్టీని కాదని ఇతర పార్టీలకు ఓటు చేస్తే మురికి కాలువలో వేసినట్లేనని అన్నారు. అధికారంలో ఉన్న నాడు చేయని వాడు ఇప్పుడు ఎలా చేస్తాడో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. ఏ అభివృద్ధి పనులు జరగాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా మాత్రమే జరగాలని అన్నారు. నిజాయితీగా పని చేసే వారిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. 15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న ఏం అభివృద్ధి చేశాడో మనందరికీ తెలుసని అన్నారు. తెల్లారి లేస్తే నన్ను తిట్టడమే ఆయన పని అని, పని లేని వారికీ మాటలు ఎక్కువని విమర్శించారు. రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి ఘన్ పూర్ ఒరేగబెట్టింది ఏమి లేదని అన్నారు. సొంత చిన్నాన్న కొడుకు దగ్గరనే దళిత బందు ఇప్పిస్తానని రెండు లక్షలు తీసుకొని మోసం చేసిన ఘనుడు అని ఆరోపించారు.

-మరో 50కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తాను:

ఎన్నికలు ముగిసిన వెంటనే మరో 50కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటికే ఒక్కో వార్డులో అభివృద్ధి పనులకు కోటి రూపాయలు కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుకు 2 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కడియం శ్రీహరి మాట ఇస్తే ఖచ్చితంగా చేసి తిరుతాడని అన్నారు. నేను ఎం తాగి మాట్లాడటం లేదని, కొంత మంది తాగి సోయి లేకుండా మాట్లాడతారని ఏద్దేవా చేశారు. ఎస్సీ కాలనిలోని డ్రైనేజి నీరు వాగు వరకు వెళ్లే విధంగా 4 కోట్లతో కాలువ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లలో ఒక్క ఎస్సీ కాలనీలోనే 100 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీ స్మశాన వాటికకు 3ఎకరాల భూమి 3నెలలో కొనిస్తానని అందుకు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. మున్సిపాలిటీ చేసింది నేను, మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు తెచ్చింది నేను, మరో 50కోట్లు తెచ్చేది కూడా నేనే అని ఘనపూర్ మున్సిపాలిటీలో అభి వృద్ధి జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

-ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో చేరికలు:
12వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతి కుమార్ పోటీ నుండి తప్పు కొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటికొండ వినయ్ కుమార్ కు సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాటికొండ దేవయ్య, తాటికొండ నవీన్, తాటికొండ కుమార్, మాతంగి అశోక్ లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, వార్డు ఇంచార్జ్ లు, కో ఆర్డినేటర్లు, మున్సి పాలిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply