BRS | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి – హరీష్ రావు..

BRS | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి – హరీష్ రావు..
BRS, బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాష్ట్ర మాజీ మంత్రి టీ హరిష్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. బెల్లంపల్లి మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలు ఉత్సాహంగా బీఆర్ఎస్ పరిపాలన ఆహ్వానిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మోసపూరితంగా సాగుతుందని విమర్శించారు. సింగరేణి సంస్థను స్కాములతో దివాలాదీసి తెలంగాణకు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వేలకోట్ల రూపాయల స్కాములు చేసి సిరుల సింగరేణినీ దివాలా తీస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా తరిమికొట్టాలన్నారు.
సింగరేణి నిధులు, తెలంగాణ జలాలను డైవర్షన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పదవిని ప్రజలు ఖచ్చితంగా డైవర్షన్ చేయాలని పిలుపునిచ్చారు. రెండున్నర సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణిలో ఉద్యోగాలు ఒక్కరికి ఇవ్వలేదని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, కొత్తగనులు లేకుంటే పోయాయి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు బుట్టలో వేషారన్నారు. సింగరేణితో పుట్టిన బెల్లంపల్లిని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ను గద్దదించాలని ఉద్ఘాటించారు. ఆరు గ్యారంటీల్లో పెన్షన్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి స్థానిక పాలనను కైవసం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణ, మనం సింగరేణి కాపాడుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలు నగేష్ ముదిరాజు, గోగుల రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడకల శ్రావణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు సుందర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు.
