AP |శ్రీ‌కాళ‌హస్తీశుని ఆలయ పైకప్పు పున‌రుద్ధ‌ర‌ణ పూర్తి

ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : సుప్రసిద్ధశ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం లో రూ 5 కోట్ల వ్యయంతో పైకప్పున‌కు సంప్రదాయ పద్ధ‌తుల్లో నిర్వహించిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర లోని పూణే కు చెందిన వి.హెచ్ గ్రూప్ అధినేత బి.వెంకటేశ్వరరావు స్వామి పై భక్తితో స్వంత నిధులు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించార. వర్షపు నీటి లీకేజీని నివారించేందుకు ప్రాచీన, పర్యావరణహిత పద్ధతులలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయ ప్రాంగణం పై కప్పు పునరుద్ధరణ పనులను చేపట్టారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఆలయ దైవ సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిందని, సుమారు 500 సంవత్సరాలు మన్నిక ఉంటుందని సంబంధిత నిపుణులు తెలిపారు. ఈ మహత్తర కార్యానికి ఎపిగ్రఫీ డైరెక్టర్ డా.కె. మునిరత్నం రెడ్డికి సాంకేతిక పరమైన మద్దతును అందించారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు వి హెచ్ గ్రూపు అధినేత వెంకటేశ్వరరావు రూ 5 కోట్లు వెచ్చించి మహత్తర కార్యాన్ని పూర్తి చేసినందుకు తిరుపతి లోక్ సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి ఈరోజు వారికి, వారి బృందానికి, సహకరించిన ఎపిగ్రఫీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *