13వ వార్డు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు

మక్తల్ , ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కాంగ్రెస్ నాయకులు గోవిందరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏం డి.ఫయాజ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 13 వ వార్డ్ లో కాంగ్రెస్ నాయకులు జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 13 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మక్తల్ సరిత గోవింద్ రావు ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను వివరించారు.రోడ్లు, డ్రైనేజీలు,వీధి లైట్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు.వివిధ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ముందు ఉంటాననీ అన్నారు. 13వ వార్డును అభివృద్ధి పథంలో ముందు ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పారు. ఈ ప్రాంతం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వేస్తున్న వాకిటి శ్రీహరి సహకారంతో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో సరిత గోవిందరావును గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రమేష్ రావు,పాండు, శ్రీకాంత్, వాదిరాజ్ ,ఆంజనేయులు ,సుందర్, శ్యాంసుందర్ ,నరసింహులు, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
