15వ వార్డులో బీజేపీ జోరుగా ప్రచారం..

15వ వార్డులో బీజేపీ జోరుగా ప్రచారం..

  • ఓటర్ల అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డులో బీజేపీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ 15 వార్డులో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి విజయ్ కుమార్ వెంట బీజేపీ నాయకులు కుక్కల శ్రీధర్, శంకర్, నాయకులు, నాయకురాళ్లు ఉన్నారు.

Leave a Reply