19వార్డులో భారీ జన సమీకరణతో గులాబీ దండు ప్రచారం

19వార్డులో భారీ జన సమీకరణతో గులాబీ దండు ప్రచారం
- వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తా
- 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి హరిఫా బేగం
షాద్ నగర్, ఆంధ్రప్రభ : భారీ జన సమీకరణతో 19వ వార్డులో అసిఫాబేగం దూసుకుపోతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆమెకు డమరుకం పడుతున్నారు. గతంలో తన కుమారుడు ఎజాజ్ (అడ్డు) 19వ వార్డులో మాజీ ఎమ్మెల్యే అంజన్న అంజయ్య యాదవ్ సౌరద్యంలో అనేక మౌలిక సదుపాయాలను చేసినట్లు పేర్కొన్నారు. మహిళగా తనకు అవకాశం వచ్చింది.. మీరు సహకరించాలన్నారు. కార్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో కాలనీలోని మౌలికల సదుపాయాలన్నీ పూర్తి చేస్తానని, తాను మీ సొంత మనిషినని, ఆదరించి.. అభిమానించి.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
