ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. కాగా, ఈ దాడులపై భూపేశ్ స్పందించారు. కోర్టు కొట్టివేసిన కేసులో ఈడీ సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నదాడులంటూ ఆయన మండిపడ్డారు.
ED Raids | చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ నివాసాలలో ఈడీ సోదాలు
