అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి

12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ఎండి.మొయిజ్ హుస్సేన్
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు అభివృద్ధికి పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటా అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదించి 12వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎండి.మొయిజ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు బుధవారం మక్తల్ పట్టణంలోని 12వ వార్డులో తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి ఓటు వేయండి అంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ వార్డు అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు .గతంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అండతో ఎంతో అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు .తనను గెలిపిస్తే 12వ వార్డు పరిధిలోని అన్ని గల్లీలో సీసీ రోడ్డు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని అన్నారు .అధికార పార్టీతో అభివృద్ధి జరగదని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్‌గా గెలిపించవలసిందిగా ఎండి.మొయిజ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.ఈ.కార్యక్రమంలో అన్వర్ హుస్సేన్, వన్నెకారి రాజు ,సిద్దిఖ్ ,రహమత్, నిజాం, మీరజ్ ,సోహెల్ ,అదనాన్ ,ఆసిఫ్ ,సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
