Jaggareddy | సంగారెడ్డి, సదాశివపేటలో నో రెబల్స్

Jaggareddy | సంగారెడ్డి, సదాశివపేటలో నో రెబల్స్

  • రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు తిరుగుబాటు అభ్యర్థులు లేరు
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Jaggareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రెబల్ అభ్యర్థులు లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పార్టీ నిర్ణయాలకు పూర్తి క్రమశిక్షణతో అభ్యర్థులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తప్పుదారిన వెళ్లి రెబల్‌గా నామినేషన్ దాఖలు చేస్తే, అటువంటి వారిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, అందరూ కలిసి ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply