TG | 12,14 వార్డుల్లో బీఆర్ఎస్లో చేరికలు

TG | 12,14 వార్డుల్లో బీఆర్ఎస్లో చేరికలు
TG | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వీడుతూ 12వ, 14వ వార్డులకు చెందిన కీలక నాయకులు ఈ రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ కో–ఆప్షన్ ఎండి ఖాజా, ఎండి అబ్రార్, ఏరుకొండ అవినాష్, బాలాజీ బ్రహ్మం, కనుగుల నరేష్, బోయిని గణేష్, దంచనాల హరీష్, బండి అభిలాష్, దంచనాల శ్రీకాంత్, బండ అరవింద్ (కన్ని)తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాకీర్ అలీ, ఎండి రబ్బాని, ఎండి మక్సుద్, ఎండి కలీం, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
