TG | ఇద్దరు కానిస్టేబుల్ లకు తీవ్ర గాయాలు..!

TG | ఇద్దరు కానిస్టేబుల్ లకు తీవ్ర గాయాలు..!
TG | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సీఎం సభ విధుల నిర్వహణ కోసం బైక్ పై వెళ్తున్న మదార్, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్ల ను కంటైనర్ వాహనం వెనక నుంచి ఢీకొనడంతో ఇద్దరు కానిస్టేబుల్ లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన పోలీస్ వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.
