Suicide Attempt | తల్లి ఆత్మహత్యాయత్నం

Suicide Attempt | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : తన ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపి, ఆపై డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ లో చోటుచేసుకుంది. రూప అనే మహిళ తన ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపి, ఆపై డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. భర్త స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా పిల్లలు అప్పటికే చనిపోయి కనిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రూపను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Leave a Reply