45th Rank | జాతీయస్థాయిలో డబుల్ ఏ ఏ రేటింగ్…

45th Rank | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయస్థాయిలో మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న ఎన్ పిటిఈఎల్ (నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్ హాండ్స్ లెర్నింగ్) కోర్సుల్లో భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల లోకల్ సెంటర్ కు జాతీయస్థాయిలో టాప్ 200లో 45వ ర్యాంక్ అందుకున్నట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి హెచ్ వి ఎస్ రామకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్ పి టి ఈ ఎల్ లోకల్ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ బి హెచ్ వి ఎస్ రామకృష్ణంరాజు ప్రొఫెసర్ అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ… జాతీయస్థాయి ర్యాంకులు వచ్చిన కళాశాలల కోఆర్డినేటర్స్ కు మద్రాస్ ఐఐటీలో సత్కారం జరిగిందని వివరించారు. తమ కళాశాలలో గత ఏడాది జులై 25 నుండి డిసెంబర్ వరకు ఎన్ పి టి ఈ ఎల్ కోర్సుల్లో 2,595 మంది కోర్స్ పూర్తి చేసే సర్టిఫికెట్లు అందుకున్నారన్నారు. వారిలో 104 మంది గోల్డ్, 492 మందికి సిల్వర్, 1048 మందికి ఎలైట్, 134 మంది టాపర్స్ గాను, 817 మంది సక్సెస్ ఫుల్ గాను కోర్స్ పూర్తి చేసే సర్టిఫికెట్లు అందుకున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల పెర్ఫార్మెన్స్ బట్టి జాతీయ స్థాయిలో టాప్ 200 కళాశాలలను ఎంపిక చేయగా అందులో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ పి టి ఈ ఎల్ సెంటర్ 45వ పొజిషన్ పొంది డబులు ఏఏ ర్యాంక్ సాధించింది అని వివరించారు. ఈ సందర్భంగా అకడమిక్ డీన్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా జనవరి – జూన్ మాసానికి గాను ఇప్పటికే ఐదువేల మంది రిజిస్టర్ అయ్యారని మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవి కిరణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
