WPL | డిఫెండింగ్ ఛాంపియన్ షాక్… పోరాడి ఓడిన బెంగళూరు !

  • టోర్నీ నుంచి ఆర్సీబీ ఔట్ !
  • 12 పరుగుల తేడాతో యూపీ విజయం
  • సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్‌

మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు జ‌రిగిన‌ కీలకమైన మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు ఓట‌మిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో డ‌బ్ల్యూపీఎల్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఆర్సీబీ.

టాస్‌ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా, యూపీ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 225 పరుగులు చేయగా, బెంగళూరు 19.3 ఓవర్లలో 2134 పరుగులకు ఆలౌటైంది. దీంతో 12 పరుగుల తేడాతో లక్నో వారియర్స్‌ విజయం సాధించింది.

యూపీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌గా.. ఓపెనర్లు గ్రేస్‌ హర్రీస్‌ (39), జార్జియా వోల్‌ 99 పరుగుల నాటౌట్‌తో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కిరణ్‌ నవ్‌గిరె (46), ఆఖరిలో చినెల్లె హెన్రీ (19), సోఫీ ఎక్సెల్‌స్టోన్‌ (13) బ్యాట్‌ జులిపింంచడంతో భారీ స్కోరు నమోదు చేసింది. బెంగళూరు బౌలర్లలో జార్జియా వరేహమ్‌ 2 వికెట్లు పడగొట్టగా, చార్లీ డీన్‌ ఒక వికెట్‌ తీసింది.

అనంతరం 256 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఓపెనర్‌ సబ్భినేని మేఘన (27), మరో ఓపెనర్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన(4) మరోసారి నిరుత్సాహపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఎల్లిస్ పెర్రీ (28) చేసింది. రిచా ఘోష్ (69) తో రాణించింది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ 3, సోఫీ ఎక్లీస్టోన్‌ 3, చినెల్లిd హెన్రీ 2 వికెట్లు పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *