Vikarabad Rural | రాస్తారోకో నిర్వహించిన నాయకులు…

Vikarabad Rural | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావుని విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో మండల అధ్యక్షుడు నారేగూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ పిలుపు మేరా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది అని, ప్రతి ఎన్నికల సమయం లో ఏదో అలజడి సృష్టించి ప్రజలని, బీఆర్ ఎస్ కార్యకర్తలని భయానికి గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులని డీఎస్ పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరా వికారాబాద్ సి ఐ రఘురామ్ పోలీస్ స్టేషన్ తరలించి సొంత పూచి పైన విడుదల చేసారు.

Leave a Reply