Bikkanoor | జాతీయ మహాసభలు విజయవంతం చేయాలి…

Bikkanoor | బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఒరిస్సాలో జరిగే బీఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సందుగారి రవీందర్ రెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 8 వరకు ఒరిస్సాలోని జగన్నాథ ఆలయం వద్ద మహాసభలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 2,500 మంది బీఎంఎస్ ప్రతినిధులు 12 దేశాల నుండి 36 కార్మిక ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.
ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనసుకు మాండవ్య మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. భారతరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్ట ప్రకారం వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని తెలిపారు. కార్మిక సమస్యలపై బిఎంఎస్ నిరంతర పోరాటం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులు పెద్ద ఎత్తున జాతీయ మహాసభలను పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
