AP | ఏసీబీ సోదాలు

AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వరరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. రాష్ట్రంలోని దర్శి, నరసరావుపేట, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఆరు ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు.

Leave a Reply