sam2026 | సమంత పేరు మారబోతుందా? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!

sam2026 | సమంత పేరు మారబోతుందా? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!
sam2026 |పెళ్లి తర్వాత సమంత కొత్త పేరు ఇదేనా?
‘మా ఇంటి బంగారం’తో కొత్త ప్రయాణం
నటిగా, నిర్మాతగా స్పీడ్ పెంచనున్న సమంత
sam2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సమంత.. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టే.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మాయ చేసింది. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 1న సమంత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సామ్.. నేమ్ మార్చుకుంటుంది. అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. సమంత కొత్త పేరు ఏంటి..? ఎప్పుడు మార్చుబోతోంది..?

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు సినిమాల పై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత సమంత పేరు మార్చుకోనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు సమంత రూత్ ప్రభు అని పిలువబడిన ఆమె, ఇక పై సమంత నిడిమోరుగా పేరు మార్చుకోనుందట. ఈ పేరును మా ఇంటి బంగారం సినిమా టైటిల్ కార్డ్స్‌తో అందరి ముందుకు రానున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఓ వైపు నటిస్తూనే మరో వైపు నిర్మాతగా సినిమాలు చేయాలి అనుకుంటుంది.

అంతే కాకుండా.. రాజ్ నిడిమోరుతో కలిసి సినిమాలు చేసేలా ప్లానింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మా ఇంటి బంగారం సినిమాని నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాకి రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మూవీతో సమంత నటిగా సక్సెస్ సాధించడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అంతే కాకుండా ఇక నుంచి కెరీర్ లో మరింత స్పీడు పెంచబోతుందని సమాచారం.
click here to read Lenin | ఆ రెండు బ్యానర్స్ లో అఖిల్ సినిమాలు…?
