Sangareddy | నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Sangareddy | నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓక్సెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓక్సెన్ ఒలింపియాడ్–2026 (రెడ్‌హ్యాట్ బ్రెయిన్‌యాక్ ఛాంపియన్) రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఉన్న పలు వర్సిటీల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ ఒలింపియాడ్‌ను నిర్వహించారు. మొత్తం రూ.10 లక్షలకు పైగా బహుమతులు ప్రకటించగా, విజేతలకు నగదు బహుమతులతో పాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ డీఏఓ సహ వ్యవస్థాపకుడు శివరామ్ శాస్త్రి జొన్నలగడ్డ, జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డా. శ్రీరంగ నరసింహ గాంధీ ఆర్యవల్లి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఓక్సెన్ యూనివర్సిటీ సీఈవో విశాల్ మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ ఏడాది అగ్ర బహుమతులు మహిళా విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఛాంపియన్‌గా శ్రీకా రాణా (ఓక్సెన్ వర్సిటీ) రూ.25 వేల బహుమతి గెలుచుకోగా, ప్రథమ రన్నర్ అప్‌గా ఆర్చికా రామ్ రూ.15 వేల బహుమతి, ద్వితీయ రన్నరప్‌గా మహెక్ సక్సేనా రూ.10 వేల బహుమతి పొందారు. విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందజేశారు.
