Chennur | ఇదేమి నిర్ల‌క్ష్యం..!

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎన్నికల నిర్వాహక అధికారులు కవరేజ్ కొరకు వచ్చే మీడియా పై సవతి తల్లి ప్రేమను కనబర్చి.. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసే సంఘటన మంత్రి వివేక్ నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొన‌సాగుతోంది. గ‌త రెండు రోజులుగా కవరేజ్‌కు వచ్చే మీడియా ప్రతినిధులకు ఎలాంటి ప్రదేశాన్ని కేటాయించక పోగా.. చివరి రోజు నేడు (శుక్ర‌వారం) ఓ పంచర్ కొట్టు ముందు టెంట్ వేసి చేతులు దులుపుకొన్నారు.

Leave a Reply