passes away | భర్త శ్రీనివాసన్ కన్నుమూత..

passes away | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పీటీ ఉష భర్త వి.శ్రీనివాసన్ కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని పయ్యోలిలోని తన నివాసంలో శ్రీనివాసన్ కుప్పకూలిపోగా, వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారని, అర్ధరాత్రి సమయంలో ఆయన అసౌకర్యానికి గురయ్యారని, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా క్రీడా, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉష పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడానికి న్యూఢిల్లీలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉషతో ఫోన్‌లో మాట్లాడి, ఆమె భర్త మృతికి సంతాపం తెలిపారు.
