initiative | రూ.700 కోట్ల అభివృద్ధికి శ్రీకారం

initiative | తిరుపతి(రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, రేపు జరపనున్న కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రూ.700 కోట్ల విలువైన ఒప్పందాలు, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. అందులో కుప్పం లో రూ 675 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఏడు కంపెనీలతో ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేయనున్నారు.
తొలి రోజు పర్యటనలో గుడిపల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన ఆగస్త్య విద్యాచల్ అకాడెమీని ప్రారంభించనున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడెమీ ఫెసిలిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయను నున్నారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించే ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు.
కుప్పం మున్సిపాలిటి పరిధిలో స్వర్ణ నవదిశ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కుప్పం మండలంలో వివిధ పర్యాటక సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా కంగుంది హెరిటజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్ ను ఆవిష్కరించనున్నారు. డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్ సైట్ లాంఛ్ చేయనున్నారుమరో రూ. 4 కోట్లతో కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కుప్పంలో పున్నమి రిసార్ట్ ను ప్రారంభించనున్నారు.
