Road Accident | పెందూరులో.. రోడ్డు ప్రమాదం..

Road Accident | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : గోదావరి జిల్లా అంతర్వేది తీర్థం ముగించుకుని తిరిగి వెళుతున్న నాగాయలంక మండలం సోర్లగొంది గ్రామస్తులకు బంటుమిల్లి మండలం పెందూరు గ్రామ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుగు ప్రయాణంలో టాటా ఇత్రా మ్యాజిక్ లో 15 మంది ప్రయాణిస్తున్నారు. అయితే.. జాతీయ రహదారి పై వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారందరికి గాయాలు అయ్యాయి.

15 మందికి గాయాలు కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. వీరిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వెంటనే తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేకపోయినా ఇప్పటికి తీవ్ర గాయాలతో క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. కాగా నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. క్షతగాత్రులు మచిలీపటం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని పై బంటుమిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

