Medical health | సబ్ సెంటర్ తనిఖీ…

Medical health | సబ్ సెంటర్ తనిఖీ…

Medical health | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం రాజారాంపల్లి సబ్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ఆమె పరిశీలించారు. సబ్ సెంటర్ పరిధిలోని హైపర్ టెన్షన్, డయాబెటిస్, లెప్రసీ, టీబీ, ఎన్‌సీడీ కేసుల వివరాలతో పాటు కుక్క కాటు, కోతి కాటు వ్యాక్సిన్లు, మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును డా.సుజాత సందర్శించారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ పి. లవ కుమార్, డీపీవో రవీందర్, డీపిహెచ్‌ఎన్ జ్యోతి, సూపర్వైజర్ మనోరమ, ఏఎన్‌ఎం పి. లావణ్య, ఎంపిహెచ్ఏ (ఎం) శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు జమున, సరస్వతి పాల్గొన్నారు.

Leave a Reply