Encounter | ఇద్దరు మావోయిస్టులు మృతి

Encounter | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్, 9mm పిస్టల్, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అడవిలో ఇంకా మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
