started | రూ. 3 కోట్లతో పనులు ప్రారంభం…

started | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపాలిటీ 2, 10వ వార్డులలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో టీయూఐఎఫ్డీ నిధుల నుంచి రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులే కాంగ్రెస్ పార్టీ పనితీరుకు నిదర్శనమని పేర్కొంటూ, మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపొందిన అనంతరం పట్టణ అభివృద్ధికి మరిన్ని కీలక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

మాట మీద నిలబడి పనిచేసే నాయకులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పర్స అనంతరావు (ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు), మాజీ కౌన్సిలర్ సిహెచ్. గంగాధర్, చెప్పాల రాజన్న, బందుక్, చింతలూరి దశరథ్, చెప్పాల నర్సయ్య, రూపాల నర్సయ్య, చెప్పాల, కాంతయ్య, సేవాలాల్, చెప్పాల కర్ణం, పత్రి కిషన్, చింతలూరి గంగాధర్, జంగిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply