Bhimgal Rural | నిబంధనలు తప్పనిసరి పాటించాలి

Bhimgal Rural | నిబంధనలు తప్పనిసరి పాటించాలి
- ఎస్సై తిరుపతి
Bhimgal Rural | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ అఫ్ కండక్ట్) అమలులోకి రావడంతో ప్రజలకు తెలుపుతూ… ఈ సందర్భంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు క్రింది నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా పోలీసు శాఖ సూచించడం జరిగింది.
ఎలాంటి రసీదు లేకుండా 50 వేలకు మించి నగదును తరలిస్తే ఎలక్షన్ కమిషన్ వారు పట్టుకుని సీజ్ చేయబడును ఎన్నికల ప్రభావం చూపే విధంగా నగదు (కాష్) తీసుకెళ్లడం, పంపిణీ చేయడం నిషేధం, అనుమా నాస్పదంగా నగదు తరలింపులు చేసినట్లయితే నగదును స్వాధీనం చేసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ సిహెచ్ తిరుపతి అన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఎన్నికల కాలంలో మద్యం (వైన్ /లిక్కర్) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా,అక్రమ విక్రయాలు పూర్తిగా నిషేధించడం జరిగింది. మద్యం దుకాణాలు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయాల్లో మూసి వేయబడును.నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభాలు ఓటర్లకు పంపిణీ చేయడం నేరంగా పరిగణించబడును.ఎన్నికల ప్రచారంలో అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు నిర్వహించ రాదు.
మత, కుల, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రచారాలు చేయకూడదు. సోషల్ మీడియా వేదికగా అసత్య సమాచారం లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఎస్సై తెలపడం జరిగింది.
