AP | 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ …

AP | 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ …

శాప్ చైర్మన్ రవి నాయుడు..

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 26 క్రీడా విభాగాలలో మొత్తం 323 అసిస్టెంట్ కోచ్ (రెగ్యులర్) పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ నియామకాలకు రాష్ట్రంలో అర్హత కలిగిన క్రీడాకారులు కోచ్‌లు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రవి నాయుడు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను www.sportsauthorityofindia.nic.in వెబ్‌సైట్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులు, కోచ్‌లు సద్వినియోగం చేసుకోవాలని రవి నాయుడు తెలిపారు.

Leave a Reply