TG | ఆశావహులు అధికం – ఎంపికనే తకరారు ..

TG | ఆశావహులు అధికం – ఎంపికనే తకరారు ..

  • అన్నిపార్టిల్లో ఇదే తీరు..

TG | చెన్నూర్ ఆంధ్రప్రభ: ఎన్నికల నిర్వహణ షెడ్యులు విడుదలైన అభ్యర్థుల ఖరారులో ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితా అధిష్టానలు చేస్తున్న జాప్యం పై ఆశవహులు ఆందోళన గురవుతున్నారు.చెన్నూరు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి..ఒకరిని మించి మరొకరు పథక రచన చేస్తున్నారు.. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు…చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా ప్రతి వార్డు లో అన్ని పార్టీలనుంచి ఆశావాహులు అధికంగా ఉన్నారు..ఎవరికి పార్టీ నుంచి హామీ బి ఫారం వస్తుందో కానీ ఎవరికి వారే తమకంటే తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు… అధికార పార్టీ కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది..అయితే పక్కా గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నది..దీనిపై సాక్షాత్తు మంత్రి వివేక్ ఇంటిలిజెన్స్ ద్వారా సర్వే చేయిస్తున్నారు…ఇప్పటికీ ఎవరికి హామీ ఇవ్వకపోవడం గమనార్హం…Brs, BJP లు సైతం ఇదే ధోరణిని అవలంబిస్తున్నాయి…దీనితో ఆశావహులు ఎవరి తరహాలో వారు టికెట్ పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు..దీటైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలెట్టడంతో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేకపోతున్నది…

ఒకరిపై మరొకరు….

అన్ని పార్టీలు ఒకరిపై మరొకరు కన్నేశారు..ఏదైనా ఒక పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తే .. ఆ స్థానాల్లో ఇంకా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మరో పార్టీ వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నది…ఇదే తరహాలో అన్ని పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుండటంతో..అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి…రెపో మాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థుల ఎంపిక తుది ఘట్ట

Leave a Reply