Chityala | మినీ మేడారం జాతర

Chityala | మినీ మేడారం జాతర

  • పురేడు గుట్ట సమ్మక్క- సారలమ్మ, జాతర ప్రారంభం

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, కాల్వపల్లి గ్రామాల శివారు పూరేడు గుట్ట సమ్మక్క- సారాలమ్మ మినీ మేడారం జాతర నేడు బుధవారం సారాలమ్మ గద్దెకు చేరుకొనుంది. దీంతో భక్తులు మొక్కులు చెల్లించనున్నారు. ఈనెల 28 నుండి31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగనుంది. కాగా పూరేడు గుట్ట మినీ మేడారం జాతరకు నేటికీజాతర ఉత్సవ కమిటీ, పలుఅభివృద్ధి పనులకు నిధులు, మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జాతర కమిటీ. జాతరలో అభివృద్ధి పనులు విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, జాతర ప్రాణం శుభ్రత, రోడ్డు, మరమ్మత్తుల పనులు , చేసిన్నట్లు తెలిపారు . జాతర వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాతరకు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుండి రెండు లక్షల మంది భక్తులు మూడు రోజుల్లో మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.

Chityala

Leave a Reply