Koduru | సద్వినియోగం చేసుకోండి..!

Koduru | సద్వినియోగం చేసుకోండి..!
Koduru | కోడూరు, ఆంధ్రప్రభ : పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోడూరు వెటర్నరీ డాక్టర్ రోహిత్ చంద్ర పేర్కొన్నారు. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, నట్టల నివారణ మందులు, ఖనిజ లవణ మిశ్రమాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశువులు క్షేమంగా ఉంటేనే రైతులకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చైతన్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
