AP | సి.పి.ఐ సీనియర్ నాయకునికి నివాళులు

AP | సి.పి.ఐ సీనియర్ నాయకునికి నివాళులు

AP | గుడివాడ, ఆంధ్రప్రభ : సి.పిఐ సీనియర్ నాయకులు గూడపాటి సువిశ్వేశ్వరరావు (96) పెద్ద ఏరికపాడులోని తన స్వహృహం వద్ద మృతి చెందారు. ఆయనకు ఏపిడబ్ల్యూ జే, ఏపిఎమ్.పి.ఏ జర్నలిస్టుల సంఘాల తరపున ఏపిఎంపిఏ అధ్యక్షులు మత్తి శ్రీకాంత్, సీనియర్ జర్నలిస్ట్ వీర్ల శ్రీరామ్ యాదవ్, శ్యాంబాబు, డి.వి.కృష్ణారావు, తెలుగు భాష వికాస సమితి అధ్యక్షులు డి.ఆర్.బి.ప్రసాద్, సువర్ణ బాబు, సయ్యద్ గఫార్, బద్దె ప్రకాష్, దాలిపర్తి ధన్వంతరి, మార్కిస్టు అధ్యయన వేదిక సమన్వయ కర్త బి.వి.శ్రీనివాసరావు, టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ, సాహితీ స్రవంతి అధ్యక్షులు లంకా సురేంద్ర బుధవారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

దరిదాపు 80 ఏళ్ల రాజకీయ జీవితం గడిపారు. తన 15 యెట ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చేరి రైల్వే ఉద్యోగం చేస్తూ ఆ తరువాత చాలా కాలం గుడివాడ ఏరియా సి.పి.ఐ కార్యదర్శిగా సేవలు అందించారు. తన పెద్ద కుమారుడు గూడపాటి రాజు విశాలాంధ్ర విలేకరిగా చేస్తూ, ఏపి.డబ్ల్యూ జే.అధ్యక్షులుగా పని చేస్తున్నారు. చిన్న కొడుకు గూడపటి ప్రకాష్ సి.పి.ఐ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయనకి ఐదుగురు సంతానం.

Leave a Reply