Drugs | డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం….

Drugs | డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం….
- రూరల్ సీఐ డి. చవాన్…
- కంచికచర్లలో డ్రగ్స్ పై దండయాత్ర.. సైకిల్ ర్యాలీ.
Drugs | కంచికచర్ల, ఆంధ్రప్రభ : కంచికచర్ల పట్టణంలో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం రూరల్ సీఐ డి. చవాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని పలు వీధుల్లో యువతకు డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తూ మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ పై దండ యాత్ర కార్యమానికి నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ల నుండి విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలు భారీగా తరలి వెళ్లారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ పై దండ యాత్ర కార్యక్రమం మంగళవారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద నుండి ప్రారంభం అవుతున్నది. సైకిల్ యాత్రలో పాల్గొనుటకు రూరల్ జోన్ డిసిపి బి. లక్ష్మి నారాయణ ఉత్తర్వుల మేరకు, నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ అద్వర్యంలో నందిగామ రూరల్ సీఐ డి. చవాన్ నేతృతంలో కంచికచర్ల లోని పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీగా విజయవాడ తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా సీఐ డి. చవాన్ మాట్లాడుతూ నేటి యువత చైతన్య వంతులు కావాలని, డ్రగ్స్ కు బానిసలై పలు నేరాలకు పాల్పడుతున్నారని, మహిళలపై అఘాయిత్యాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు ఆత్మహత్యలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సిఐ డి. చవాన్ తెలిపారు.
సే నో టు డ్రగ్స్ అంటూ విద్యార్థులు ఫ్ల కార్డులు చేతపట్టి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీస్ విద్యార్థుల ప్రదర్శన జుజ్జూరు రోడ్డు, నెహ్రూ సెంటర్, బస్టాండు, పోలీస్ స్టేషన్ మీదగా పట్టణంలో కొనసాగింది. విద్యార్థులందరూ ప్రదర్శన అనంతరం విజయవాడ డ్రగ్స్ పై దండ యాత్ర కార్యమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఎస్సై పి. విశ్వనాథ్, ఎస్సై 2 జి. నాని నరేంద్ర, వీరులపాడు, ఎస్ఐ బి. అభిమన్యు, సర్కిల్ సిబ్బంది, మహిళా పోలీస్ లు, మిక్, ఎం వి ఆర్, అమృతస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
