Award | ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం…

Award | ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం…

Award | జైనూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవల అందించి, ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా అవార్డు తీసుకున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జై నూర్ మండలంలోని మాణిగూడ ఫీల్డ్ అసిస్టెంట్ మెస్రం మనోహర్ కు మంగళవారం జైనూర్ ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు శాలువాతోసన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ అవార్డు గ్రహీత గా ఉత్తమ అవార్డు రావడం గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈజీఎస్ ఏపిఓ నగేష్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జైనూర్ ఈజిఎస్ ఏపీవో నగేష్, సూపరిడెంట్ శ్రీనివాస్ రావు, టెక్నికల్ అసిస్టెంట్ లు దుర్గం రాజలింగు, అంబాజీ, ఆత్మరాం,లింగేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ ల సంగం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆత్రం రాజు, ఆత్రం రవీందర్, సంఘ నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు జాదవ్ పండిత్ రావ్, అంబాజీ, బాబు, దత్తు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply