Utkoor | అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి…

Utkoor | అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి…

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీ డీకే అరుణ, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని కొత్తపల్లి సర్పంచ్ ఆర్.నర్సిములు అన్నారు. మంగళవారంనారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లిలో స్మశాన వాటికలో జెసిబి యంత్రం ద్వారా ముళ్ళ పొదలు తొలగించారు. ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ గత కొన్నేళ్లుగా స్మశాన వాటికలో దట్టమైన ముళ్ళ పొదలు ఉండడంతో శవాన్ని పూడ్చి పెట్టేందుకు తీసుకు వెళ్ళేందుకు ప‌డుతున్న తీవ్ర ఇబ్బందులను గ్రహించి ముళ్ళ పొదలు తొలగిస్తున్నామని అన్నారు.

ధన్వాడ బీటీ రోడ్డు నుండి కొత్తపల్లి, బిజ్వార్ నుండి కొత్తపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం కలిగే విధంగా చూస్తానన్నారు. పార్టీలకతీతంగా గ్రామం అభివృద్ధి చెందేందుకు నూతన పాలకవర్గం సలహాలు, సూచనల మేరకు అభివృద్ధి చేస్తానన్నారు. ఎంపీడీకే అరుణ నిధులతో గ్రామంలో ఐమాక్స్ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్య వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తాననిఅన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి మంజూరు చేస్తానన్నారు. ముళ్ళ పొదలు తొలగించడంతో ప్రజలు సర్పంచ్,నుఅభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు బి.రామాంజనేయులు, నర్సిములు, యం.రాజు, బలరాం, ఆర్.రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply